ETV Bharat / state

రైతుల కోసం కదిలొచ్చిన కలెక్టర్.. భూముల పరిశీలన​

వరంగల్​ గ్రామీణ జిల్లా నల్లబెల్లి, దమ్మన్నపేట భూ రికార్డుల్లో భూముల విస్తీర్ణం తక్కువ ఉందని, రికార్డులు సరిచేయాలని రైతులు చేసుకున్న దరఖాస్తుల పట్ల జిల్లా కలెక్టర్​ మహేందర్​ రెడ్డి స్పందించారు. స్థానిక రెవిన్యూ అధికారులతో కలిసి భూములను పరిశీలించారు.

Warangal Rural Collector Inspects Formers Lands
భూములను తనిఖీ చేసిన కలెక్టర్​
author img

By

Published : Jun 13, 2020, 2:55 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా నల్లబెల్లి, దమ్మన్నపేట భూ రికార్డుల్లో తమ భూమి తక్కువగా నమోదు చేశారని.. ఉన్నతాధికారులు స్పందించి రికార్డులు సరిచేయాలని రైతులు చేసుకున్న దరఖాస్తులను జిల్లా కలెక్టర్​ మహేందర్​ రెడ్డి పరిశీలించి స్పందించారు. నల్లబెల్లి, దమ్మన్నపేట గ్రామాల్లో రాజు, సోమ్లాలకు చెందిన భూములను సందర్శించి పరిశీలించారు. రైతులకు అన్యాయం జరగకుండా రెవిన్యూ అధికారులు రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. రైతుల సమక్షంలో సరైన కొలతలు చేసి.. రికార్డుల్లో నమోదు చేయాలని స్థానిక తహశీల్దార్​ భాస్కర్​ను ఆదేశించారు. ఆయా గ్రామాల్లోని పచ్చదనం, పరిసరాల పరిశుభ్రతలపై స్థానిక ప్రజా ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.