ETV Bharat / state

రూర్బన్​ మిషన్​తో మారనున్న పర్వతగిరి మండలం ముఖచిత్రం

రూర్బన్​ మిషన్​లో భాగంగా పర్వతగిరి మండలం సహా 33 గ్రామాల ముఖచిత్రం మారనుంది. పర్వతగిరి మండలంలో చేపట్టనున్న పలు అభివృద్ధి ప్రణాళికల డీపీఆర్​లను జిల్లా కమిటీ ఆమోదం తెలిపిందని వరంగల్​ గ్రామీణ జిల్లా కలెక్టర్​ ఎం.హరిత తెలిపారు. శాఖల వారీగా తయారు చేసిన డీపీఆర్​లను జిల్లా కమిటీ ఆమోదించినట్లు పేర్కొన్నారు.

warangal rural collector haritha review on rurban mission in collectorate
రూర్బన్​ మిషన్​తో మారనున్న పర్వతగిరి మండలం ముఖచిత్రం
author img

By

Published : Sep 4, 2020, 12:49 PM IST

రూర్బన్ మిషన్​లో భాగంగా వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలో చేపట్టనున్న పలు అభివృద్ధి ప్రణాళికల డీపీఆర్​లను జిల్లా కమిటీ ఆమోదం తెలిపిందని కలెక్టర్ ఎం.హరిత తెలిపారు. బుధవారం కలెక్టరేట్​లో రూర్భన్ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా తయారు చేసిన డీపీఆర్​లను జిల్లా కమిటీ ఆమోదించినట్లు తెలిపారు. పర్వతగిరిలో శాఖల వారీగా మోడ్రన్ డంపింగ్ యార్డు నిర్మాణానికి, అలాగే డీఆర్డీఏ శాఖ ద్వారా స్కిల్ డెవలప్​మెంట్​ ట్రైనింగ్ సెంటర్, జూట్ బ్యాగ్, అగర్ బత్తీల తయారీ, పేపర్ ప్లేట్స్​ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులు ఉపయోగించే యంత్రాల పనిముట్లు, పప్పు మిల్లు, చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ నిర్మా ణం, ఉద్యాన శాఖ ద్వారా కూరగాయల పందిళ్లు, విజయ డైరీ పాలశీతలీకరణ కేంద్రం, పశుసంవర్ధక శాఖ ద్వారా రెండు పశువైద్యశాలల నిర్మాణానికి ఆమోద ముద్ర వేసినట్లు వివరించారు.

పంచాయతీ శాఖ ద్వారా కూరగాయల మార్కెట్, అన్నారం దర్గా వద్ద సత్రం, షాపింగ్ మాల్, మోడ్రన్ ఫంక్షన్ హాల్, మార్కెటింగ్ శాఖ ద్వారా ఏనుగల్లు, కొంకపాక గ్రామాల్లో గోడౌన్స్​ నిర్మాణం, నీటి పారుదల శాఖ ద్వారా అన్నారం చెరువు, కోలకమ్మ చెరువు, సవారీ కుంట అభివృద్ధికి తీర్మానం చేసినట్లు తెలిపారు. పర్యాటక శాఖ ద్వారా అన్నారం చెరువు, కోలకమ్మ చెరువుల వద్ద ట్యాంకుబండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎనిమిది గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు, పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆపరేషన్ థియేటర్, పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం, సైన్స్​ ల్యాబ్​లు, మరుగు దొడ్ల నిర్మాణం, 9 పాఠశాలల్లో మంచినీటి సరఫరా, 6 పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్​రూమ్​ల నిర్మాణానికి ఆమోద వేసినట్లు పేర్కొన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 4 గ్రామాల్లో మోడల్ అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే క్రీడల శాఖ ఆధ్వర్యంలో పర్వతగిరిలో మినీ స్టేడియం, ఓపెన్ ఎయిర్ జిమ్​కు జిల్లా కమిటీ తీర్మానం చేసినట్లు కలెక్టర్ వివరించారు. మరికొన్ని నెలల్లో రూర్బన్ పథకం ద్వారా పర్వతగిరి మండలం సహా 33గ్రామాల ముఖచిత్రం మారనుంది.

ఇవీ చూడండి: యాదాద్రి హంగులు.. స్వామివారికి బంగారు ఊయల..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.