ETV Bharat / state

Kuchipudi dancer Chandana warangal: పదిహేనేళ్లకే 250 ప్రదర్శనలు.. 20కి పైగా బిరుదులు - kuchipudi dancer appam chandana performances world wide

ప్రతి మనిషిలో ఎవరికీ తెలియని ఓ ప్రత్యేకత, ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించి వారికి సరైన సహకారం, తోడ్పాటు అందించినప్పుడే వారు ఆ రంగంలో రాణించగలరు. కేవలం చదువే కాకుండా ఇతర రంగాల్లో ఆసక్తి ఉన్న వారి అభిరుచిని గుర్తిస్తే.. జరిగే అద్భుతాలు కోకొల్లలు. తమ కూతురులోని ప్రతిభను గుర్తించి.. ఆమెను ప్రోత్సహించారు కాబట్టే.. చందన పదిహేనేళ్లకే సాంప్రదాయ నాట్యం కూచిపూడిలో 250కి పైగా ప్రదర్శనలు ఇచ్చి.. చిన్న వయసులోనే ఎన్నో బిరుదులు సొంతం చేసుకుంది. మరిన్ని ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధమంటూ ప్రభుత్వం తరఫు నుంచి సహకారం ఆశిస్తోంది ఈ ఓరుగల్లు నాట్యమయూరి.

Kuchipudi dancer Chandana warangal
కూచిపూడి నృత్యకారిణి అప్పం చందన
author img

By

Published : Nov 29, 2021, 4:03 PM IST

Kuchipudi dancer Chandana warangal: కళలకు పుట్టినిల్లు ఓరుగల్లు.. అలాంటి నగరంలో మరో ఆణిముత్యం అంతర్జాతీయ స్థాయిలో తన సత్తాను చాటుతోంది. పదిహేనేళ్ల వయసులోనే ఏకంగా 250కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ఔరా అనిపిస్తోంది. రాష్ట్ర స్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నృత్యంలో అద్భుత ప్రతిభను కనబరుస్తూ అందరి మన్ననలను పొందుతోంది.

ఆరేళ్ల నుంచే

వరంగల్ జిల్లా లేబర్ కాలనీకి చెందిన అప్పం రాధిక, సుధాకర్ దంపతుల ఏకైక కుమారై చందన(Kuchipudi dancer appam Chandana). చిన్నతనం నుంచీ చందన నాట్యంపై ఆసక్తి చూపించడంతో తల్లిదండ్రులు.. వెంపటి నాగేశ్వరి కూచిపూడి కళాక్షేత్రంలో చేర్పించారు. ఆరేళ్ల వయసు నుంచే నాగేశ్వరి వద్ద కూచిపూడిలో శిక్షణ ప్రారంభించింది చందన. నాగేశ్వరి అనారోగ్యంతో కాలం చేయడంతో నాగేశ్వరి కుమారై వెంపటి శ్రావణి వద్ద శిక్షణలో తుదిమెరుగులద్దుకుంది.

250కి పైగా ప్రదర్శనలు

ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న చందన.. కూచిపూడి నృత్యంలో రాణిస్తూనే చదువులో కుడా తన సత్తాను చాటుతోంది. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై 250కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. స్వర్ణ మయూరి, నాట్య మయూరి, నాట్య చూడమణి, కిన్నెర, నాట్య విలాసిని వంటి అనేక బిరుదులను సొంతం చేసుకుంది. గిన్నిస్ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డుతో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డు ఇలా పలు రికార్డుల్లో చోటు సంపాదించింది. నేపాల్​లో జరిగిన కూచిపూడి నృత్య పోటీలో భారతదేశం తరఫున ప్రదర్శన ఇచ్చి మొదటి బహుమతిని అందుకుంది.

'నేను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను. ఎనిమిదేళ్లుగా కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. మా గురువు వెంపటి శ్రావణి, తల్లిదండ్రులు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వందల కొద్ది ప్రదర్శనలు ఇచ్చాను. చదువులోనూ ముందున్నాను. ఇకముందు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని ప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరుకుంటున్నాను.' -అప్పం చందన, కూచిపూడి నృత్యకారిణి

ప్రతిభను గుర్తించాలి

చదువుతో పాటు నాట్యంలో రాణిస్తున్న చందన.. విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. తల్లిదండ్రులు చదువుతో పాటు పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వారికి చేయూతను అందించాల్సిన బాధ్యత ఉందని చందన చెబుతోంది. ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఇంకా ప్రభుత్వం తరఫు నుంచి ఆర్థిక సహకారం అందితే అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇస్తానని చెప్పుకొచ్చింది. చదువును కొనసాగిస్తూనే కూచిపూడిలో మరిన్ని ప్రదర్శనలు ఇచ్చి.. తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి, దేశానికి పేరు తేవడమే లక్ష్యంగా దూసుకుపోతోందీ చందన.

పదిహేనేళ్లకే 250 ప్రదర్శనలు.. 20కి పైగా బిరుదులు

ఇదీ చదవండి: కళాతపస్వి విశ్వనాధ్‌ను మెప్పించిన హైదరాబాదీ నాట్యమయూరి

కూచిపూడి భారతీయ సమాజానికి ప్రతీక: కేటీఆర్

కూచిపూడి, పేరిణి నృత్యంలో ప్రతిభ చూపుతున్న నాట్య మయూరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.