ఉన్నత చదువుల ద్వారానే పేదరికాన్ని అరికట్టవచ్చన్న గొప్ప ఆశయాలతో వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు సర్కారు పాఠశాల విద్యార్థులు ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించారు. కార్పొరేట్ విద్యను తలదన్నే రీతిలో ఉత్తమ ప్రతిభ కనపర్చారు.
కొత్తూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికవ్వడం పట్ల స్కూలు యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. విద్యార్థులు సీట్లు సాధించడం పట్ల వారి కుటుంబాల్లో హర్షాతిరేఖాలు వెల్లివెత్తాయి.
ఇదీ చూడండి: సాయివర్ధన్ పరీక్ష రాస్తే.. ర్యాంకు వచ్చినట్టే!