వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో అన్నదాతలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రైతుబంధు, రుణమాఫీ నిధులు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని అందువల్లే పాలాభిషేకం చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.
రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు ఇబ్బంది కల్గకుండా తీసుకున్న నిర్ణయాలు రైతుల్లో ఆనందాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. ఇంకొన్నేళ్లలో తెలంగాణ రైతులకు స్వర్ణయుగం రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి ఎర్రబెల్లి.
ఇవీ చూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్