వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు నానా పాట్లు పడుతున్నారు రైతన్నలు. జిల్లాలో ధాన్యం తరలించే వాహనాల కొరత ఎక్కువగా ఉండటం వల్ల తమ వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రక్కుల్లో ధాన్యాన్ని తరలిస్తున్నారు. రైతులంతా తమ తమ వాహనాల్లో ధాన్యం తీసుకు రావడం వల్ల వర్ధన్నపేట మండల పరిధిలోని మిల్లుల వద్ద రద్దీ ఏర్పడింది.
కిలోమీటర్ల మేర ధాన్యం బస్తాల వాహనాలతో వేచి చూడాల్సి వస్తోంది. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. రోజుల తరబడి మిల్లుల ఎదుటే ఉండాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవ తీసుకొని ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: నేడు, రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిపివేత