Warangal Airport Land Acquisition : వరంగల్ విమానాశ్రయం మళ్లీ ఊపిరి పోసుకునే దిశగా కసరత్తు ముమ్మరమైంది. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ సూచనల మేరకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌కి అదనంగా కనీసం 400 ఎకరాల భూమి ఇవ్వాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రాష్ట్రప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఎయిర్ స్ట్రిప్ పరిసరాల్లో ప్రైవేట్ భూములే అధికంగా ఉండటంతో ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Mamnoor Airport Works : తొలిదశలో చిన్న విమానాల రాకపోకలకు వీలుగా 253 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం (Hyderabad Airport) ఒక్కటే ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మరో 6 చోట్ల ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటుచేయాలని కొన్నేళ్లుగా సర్కార్ కసరత్తు చేస్తోంది. ఆ ఆరు ప్రాంతాలపై ఏఏఐ అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై సుముఖత వ్యక్తంచేస్తూ ఇటీవల ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ మేరకు తొలి దశలో వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏఏఐ (Airports Authority of India) అధికారులతో గడిచిన కొద్ది నెలలుగా సంప్రదింపులు చేస్తోంది. తాము సూచించిన అదనపు భూమి కేటాయిస్తే నిర్మాణ వ్యవహారాలు మొదలు పెడతామంటూ ఏయిర్ పోర్టు అథారిటీ అధికారులు రెండు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయగా ఆ దిశగా ముందడుగు వేసింది. వీలైనంత త్వరగా భూముల సేకరణ పూర్తి చేసి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అందించాలని నిర్ణయించింది.
Warangal Airport History : వరంగల్ జిల్లా మామునూరులో 1930లో హైదరాబాద్ చివరి నిజాం 706 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్ స్ట్రిప్ నిర్మించారు. భారత్ - చైనా యుద్ధ (India China War) సమయంలో ప్రభుత్వ విమానాల హ్యాంగర్‌గా వినియోగించారు. అప్పట్లో అతిపెద్ద రన్‌వేగా గుర్తింపుపొందింది. ప్రస్తుతం దానికి అదనంగా మరో 253 ఎకరాలు సేకరించాల్సి ఉంది. విమానాశ్రయం పక్కనే మామునూరు డెయిరీఫాంకు ఉన్న ఐదారొందల ఎకరాలలో సుమారు 40 నుంచి 50 ఎకరాలు సహా మరో 210కిపైగా ఎకరాల ప్రైవేట్ భూమి సేకరించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
Hyderabad Airport is Most Punctual : సమయపాలనలో నంబర్ వన్ 'శంషాబాద్ ఎయిర్‌పోర్టు'
అయితే ప్రైవేట్ భూమి ఎంతమంది రైతులకు చెందిదన్న వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారి సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా డెయిరీ ఫాంకు చెందిన భూమిని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. డెయిరీకి మరోచోట భూమిని కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తర్వలోనే భూ సేకరణ మొదలుపెట్టి పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. వరంగల్ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే దేశంలో వివిధ రాష్ట్రాలతో ఇతర దేశాలకు సైతం ఇక్కడి నుంచి విమానాలు ప్రయాణించనున్నాయి.
రోజుకు 500 విమానాల రాకపోకలు.. అందులో అతివల పాత్ర ఆదర్శనీయం
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఇంజిన్‌లో మంటలు.. గాల్లో చక్కర్లు కొడుతూ..