నిస్సహాయ స్థితిలో ఉన్న జాతీయ పక్షి ప్రాణాలు కాపాడి మూగజీవాలపై తమకు ఉన్న ప్రేమను వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామ ప్రజలు ప్రదర్శించారు. అనంతరం పోలీసులకు ఆ నెమలిని అప్పగించారు.
జిల్లాలోని మైలారం గ్రామంలో అనారోగ్యంతో ఎగరలేని స్థితిలో ఉన్న నెమలిని గ్రామస్థులు చూశారు. వెంటనే దాన్ని చేరదీసి ధాన్యం గింజలు, నీరు అందించి ప్రాణాలు కాపాడారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. త్వరితగతిన స్పందించిన ఎస్సై డాక్టర్ను సంప్రదించి దానికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం గ్రామస్థులతో కలిసి అటవీ శాఖ అధికారులకు నెమలిని అప్పగించారు.
ఇదీ చదవండి: తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్