వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆయకట్టు రైతులు వరుణ యాగం నిర్వహించారు. నర్సంపేట మండలం మాదన్నపేట చెరువుకట్టపై ఉన్న శివాలయంలో 365 శివలింగాలను తయారుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు. గతంలో వర్షాలు సరిగ్గా కురవని సమయంలో వరుణ యాగం నిర్వహించామని.. అదే విధంగా ఇప్పుడు ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు రైతులు తెలిపారు.
ఇవీ చూడండి:నిండుకుండలా మారిన పాలెం ప్రాజెక్టు