వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఆర్టీసీ సమ్మె ప్రభావంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పరకాలలో 85 ఆర్టీసీ బస్సులు, 24 అద్దె బస్సులు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. 456 మంది కార్మికులు పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొన్నారు. డిపో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని పోలీసులు వెల్లడించారు. పండుగ వేళ బస్సులు బయటకు రాకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గరవుతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను ఉద్ధృతం చేస్తామని కార్మికులు వెల్లడించారు.
ఇవీ చూడండి: ఇగ చర్చలు లేవు ఏం లేవు.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఆగ్రహం