పరకాలలో మూడు నెలల పసికందు మృతి వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో వైద్యం వికటించి మూడు నెలల పసికందు మృతిచెందింది. జయశంకర్ జిల్లా చింతగాని గ్రామానికి చెందిన భార్యభర్తలు శంకర్, రోజా తమ పాపకు జలుబు చేసిందని పరకాలలోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పాపకు బాగానే ఉందని చెబుతూ.. సాయంత్రం ఐదుగంటలకు పాప చనిపోయిందని వైద్యుడు తెలిపినట్లు చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని వారు ఆరోపించారు.
ఇదీ చూడండి:కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం