ETV Bharat / state

tents collapsed: కేటీఆర్ సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి

tents collapsed: హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో తెరాస ప్రతినిధుల సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అయితే అక్కడ ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది.

tents collapsed
కూలిన టెంట్లు
author img

By

Published : Apr 20, 2022, 5:25 PM IST

tents collapsed: హనుమకొండ జిల్లాలోని హయగ్రీవాచారి మైదానంలో తెరాస ప్రతినిధుల సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అయితే అక్కడ ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున గాలిదుమారం రావడంతో సభ కోసం వేసిన టెంట్లు కూలిపోయాయి. దీంతో కూలిన టెంట్లను తెరాస శ్రేణులు మళ్లీ సరిచేస్తున్నారు. సాయంత్రం పార్టీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబంధించిన పార్టీ శ్రేణులతో సభ ఏర్పాటు చేసి భారీ ఏర్పాట్లు చేశారు. రెండు జిల్లాల అధ్యక్షులూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి సమక్షంలో బాధ్యతలు చేపట్టనున్నారు.

కేటీఆర్​ పర్యటన: వరంగల్​, హనుమకొండ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన కేటీఆర్​.. ఇరు జిల్లాల్లో రూ. 193 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. హెలికాప్టర్​లో హనుమకొండ ఆర్ట్స్, సైన్స్ కళాశాల మైదానానికి చేరుకున్న కేటీఆర్​కు... ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్​, మహబూబాబాద్ ఎంపీ కవిత.. కేటీఆర్ వెంట హెలికాప్టర్​లో చేరుకున్నారు.

రూ. 20 కోట్ల 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వరంగల్ మహానగర పాలక సంస్థ పరిపాలన భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు. రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన స్మార్ట్ రోడ్డు పనులు, రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కౌన్సిల్ హాల్​, రంగంపేటలో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం రూ. 15 కోట్లతో నాలాల నిర్మాణం, పబ్లిక్ గార్డెన్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి కేటీఆర్​ రాకతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: 'కేంద్రంలో మోదీ గ్యాస్​ ధర పెంచితే.. ఇక్కడ మేం తగ్గిస్తున్నాం'

కూలీ పిల్లలు 'కోటీశ్వరులు'.. ప్రభుత్వ సాయం కోసం తిప్పలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.