వరంగల్ రూరల్ జిల్లా మందరిపేట శివారులోని రహదారి పక్కన ఆకుల రాజు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దామరంచపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి: 'ఆందోళనల నుంచి దృష్టి మళ్లింపునకే సరిహద్దుపై చర్చ'