వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో దళిత మరియు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులకు భవిష్యత్తుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులంతా చాలా జాగ్రత్తతో మెలగాలని నేతలు సూచించారు. ఆడవాళ్లను గౌరవించటం చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలన్నారు. దిశా లాంటి ఘటనలు అవగాహన లేని కొందరు మూర్ఖుల వల్ల జరుగుతున్నాయన్నారు. అలాంటి వారికి పాఠశాల దశ నుంచే అమ్మాల పట్ల గౌరవంగా ఉండటం నేర్పించాలన్నారు. భవిష్యత్తులో ఉత్తమ స్థితిలోకి వెళ్లాలంటే కౌమారదశలో విద్య మీద దృష్టి పెట్టడం ఎంతో అవసరమని విద్యార్థులకు నాయకులు వివరించారు.
ఇదీ చూడండి: 'నిర్భయ' దోషులకు ఉరి ఆలస్యం- జనవరి 7న నిర్ణయం!