ETV Bharat / state

రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక - వరంగల్ గ్రామీణ జిల్లా తాజా వార్తలు

రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు వరంగల్ గ్రామీణ జిల్లాలోని... తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. దుగ్గొండిలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ కనబరిచారని పాఠశాల ప్రిన్సిపల్​ సౌజన్య తెలిపారు.

Selection of Warangal Rural District students for state level wrestling competitions
రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
author img

By

Published : Mar 5, 2021, 1:31 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ సమీపంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు... రాష్ట్ర స్థాయి రెజ్లింగ్​ పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సౌజన్య, ఉపాధ్యాయులు గురువారం అభినందించారు.

దుగ్గొండిలో నిర్వహించిన జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇబ్రహీం, వలీపాషాలు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్​ తెలిపారు. వారిద్దరూ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.