ETV Bharat / state

నర్సంపేటలో రైతు బీమా చెక్కుల పంపిణీ - తెలంగాణ వార్తలు

నర్సంపేటలో రైతు బీమా చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. నియోజకవర్గంలో వివిధ కారణాలతో 25 మంది రైతులు మృతి చెందారని తెలిపారు. బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేసినట్లు వెల్లడించారు.

rythu bima, mla peddi sudarshan reddy
రైతు బీమా చెక్కులు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
author img

By

Published : Jun 16, 2021, 12:46 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.కోటి 25 లక్షల విలువచేసే రైతు బీమా చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 25 మంది రైతులు పలు కారణాలతో మృతి చెందగా... వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.ఐదు లక్షల చొప్పున చెక్కులను అందించారు.

రైతుల మృతితో వారి కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో రైతు బీమాను సీఎంఅందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్​తో పాటు పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.