వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహేశ్వరంలో నివాసముంటున్న బలభద్ర సారంగం... నర్సంపేటలో బీరువాల వ్యాపారం చేస్తున్నాడు. రోజూలానే దుకాణానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు సారంగం. బండారి రైస్‌మిల్ వద్దకు చేరుకోగానే... ప్రమాదవశాత్తు ముందు వెళ్తున్న లారీ వెనుక చక్రాల కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సారంగం... అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇవీచూడండి: వాతావరణశాఖ హెచ్చరిక... నాలుగు రోజులపాటు వర్ష సూచన