వరంగల్ గ్రామీణ జిల్లాలోని రహదారులు నరకకూపాల్లా తయారయ్యాయి. గుంతలు ఏర్పడి రోడ్డు ప్రమాదాలకు కారణమై ప్రాణాలను తీస్తున్నాయి. వరంగల్ - ఖమ్మం జాతీయ ప్రధాన రహదారిపై ప్రతిరోజు సగటున 5 నుంచి 10 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు రాయపర్తి మండలం మైలారం గ్రామంలో వర్షపు నీటితో ఉన్న గుంతను తప్పించబోయి రెండు లారీలు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు, ఇద్దరు క్లీనర్లకు తీవ్ర గాయాలు కాగా అందులో తమిళనాడుకు చెందిన ఒక డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇలా ప్రతిరోజు ఈ రహదారిపై ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని... ఇందుకు ముఖ్య కారణం రోడ్డుపై గుంతలేనని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: డీఆర్కే కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం