వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డు వద్ద నిన్న కురిసిన వర్షానికి కొనుగోలుకు తీసుకువచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కళ్లెదుటే నీటిపాలైన పంటను చూసిన రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సకాలంలో కాంటాలు పెట్టక పోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు వాపోతున్నారు. 25 రోజుల కిందటే వరి కోసినా ఆలస్యంగా కొనుగోలు కేంద్రం ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస వసతులు కూడా లేవన్నారు.
తడిసిన ధాన్యాన్ని అధికారులు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షం వస్తే ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు.
ఇదీ చదవండి : కాసేపట్లో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం