తెలంగాణకు నిధులు, ప్రాజెక్టుల మంజూరులో కేంద్రం మెుదటి నుంచి అలసత్వం ప్రదర్శిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. ఈసారి కేంద్రంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని.. తెరాసకు 16 సీట్లు కేటాయిస్తే.. అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయన్నారు. వరంగల్లో రేపటి ముఖ్యమంత్రి ప్రచార సభకు 32 ఎకరాల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 1000 ఆర్టీసీ బస్సులతో పాటు వేల సంఖ్యలో ఇతర వాహనాల ద్వారా దాదాపుగా 2.5 లక్షల మందిని తరలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు కడియం తెలిపారు.
ఇవీ చూడండి:ఆర్కేడ్ ఫర్నీచర్లో అగ్నిప్రమాదం... రూ. కోటి ఆస్తి నష్టం