కరోనా కారణంగా పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ రూరల్ జిల్లాలో ఉచిత వైద్య సేవలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పరకాల మున్సిపల్ ఛైర్ పర్సన్ అనిత రామకృష్ణ కొనియాడారు. పరకాలలోని జనరిక్ ఫార్మసీ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవల శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
ప్రజలంతా ఈసేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐఆర్సీఎస్ జిల్లా కోశాధికారి డా.పోతాని రాజేశ్వరప్రసాద్, జిల్లా ఎంసీ మెంబర్ బండి సారంగపాణి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు బొల్లే బిక్షపతి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొజ్జం రమేశ్, ఇంగిలి వీరేశ్రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును స్వాగతిస్తున్నా'