Rayaparthy police help to old man : వరంగల్ జిల్లాలో ఓ పోలీస్ అధికారి మానవత్వం చాటాడు. మూడు రోజులుగా బురదలో చిక్కుకుని నిస్సహాయ స్థితిలో ప్రాణాలతో కొట్టు మిట్టడుతున్న వృద్ధుడిని కిలోమీటరు దూరం భుజాలకెత్తుకుని ప్రాణాలు నిలిపిన ఘటన రాయపర్తి మండలం కొండాపురంలో చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన గొర్ల కాపరి మూడు రోజుల క్రితం గొర్లను మేపెందుకు చెరువు వద్దకు వెళ్లి బురదలో చిక్కుకున్నాడు. మూడు రోజులుగా బురదలోనే నిస్సహాయ స్థితిలో అల్లాడిపోయాడు. వృద్ధుడిని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సోషల్ మీడియాలో వైరల్
ఎస్సై బండారి రాజు చొక్కా, లుంగీ తీసుకుని అక్కడికి చేరుకున్నారు.కరోనా నేపథ్యంలో వృద్ధుడిని పట్టుకోవడానికి స్థానికులేవరూ సహకరించలేదు. దీంతో ఎస్సై స్వయంగా ఆయనకు దుస్తులు తొడిగారు. అక్కడి వరకు 108 వాహనం వచ్చే పరిస్థితి లేకపోవటంతో సుమారు కిలోమీటరు దూరం వరకు ఆ వృద్ధుడిని మోసుకొచ్చారు. ఆపై మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఎస్సై సాహసంపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు.
ఇదీ చదవండి: Two children died: విషాదం.. చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మృతి