ETV Bharat / state

శ్రీనివాసరెడ్డి మృతికి నిరసనగా ర్యాలీ

వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో తొమ్మిదవ రోజూ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. శ్రీనివాసరెడ్డి మృతికి నిరసనగా ర్యాలీలతో సమ్మెను ఉద్ధృతం చేస్తున్నారు.

శ్రీనివాసరెడ్డి మృతికి నిరసనగా ర్యాలీ
author img

By

Published : Oct 13, 2019, 7:35 PM IST

తెలంగాణ వ్యాప్తంగా 9వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసి హైదరాబాద్​లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతని మృతికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు మౌనం పాటించారు. శ్రీనివాసరెడ్డి చిత్రపటంతో వరంగల్ కూడలి వరకు పలుపార్టీల మద్దతుతో ర్యాలీగా వెళ్లి రాస్తారోకో నిర్వహించారు.

ఈ రోజు మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్​రెడ్డి మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని ఆయనపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యమం ఎలా చేయాలో కేసీఆర్​ తమకు నేర్పాడని, ఉద్యమ సెగను ముఖ్యమంత్రికి తగిలేలా చేస్తామని అన్నారు. ఏ ఒక్క కార్మికుడు అధైర్యపడి బలిదానాలు చేసుకోవద్దని వారు కార్మికులకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమానికి సీపీఎం, సీపీఐ, సీపీఐఎంల్, ప్రజాప్రంట్, ఎంఆర్పీఎస్, మాలమహానాడు, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు.

శ్రీనివాసరెడ్డి మృతికి నిరసనగా ర్యాలీ

ఇదీ చూడండి : "శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..."

Intro:Body:

Tg_Wgl_31_13_Rtc_Karmikula_Nirasanalu_Ab_Byte_02_Ts10073

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.