ETV Bharat / state

'గిరిజనుల ఇళ్లలో వెలుగునింపిన ఘనత కేసీఆర్​దే' - పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్​ తండాలను పంచాయతీలుగా చేసి, గిరిజనుల అభివృద్ధికి కృషి చేశారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గిరిజన కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత కేసీఆర్​దేనని కొనియాడారు.

parakala mla challa dharma reddy laid foundation for road constrution
'గిరిజనుల ఇళ్లలో వెలుగునింపిన ఘనత కేసీఆర్​దే'
author img

By

Published : Dec 27, 2019, 5:14 PM IST

'గిరిజనుల ఇళ్లలో వెలుగునింపిన ఘనత కేసీఆర్​దే'

ముఖ్యమంత్రి కేసీఆర్​ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.

నిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించే ఎమ్మెల్యే ఉండటం ప్రజల అదృష్టమని కూడా ఛైర్మన్​ మర్రి యాదవరెడ్డి కొనియాడారు. సీఎం కేసీఆర్​ సాయంతో ఎమ్మెల్యే ధర్మారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలబెట్టారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని విశ్వనాథపురం,కొమ్మాల గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

TG_WGL_42_27_SHANKUSTHAPANA_VO_TS10074 Cantributer kranthi parakala వరంగల్ రూరల్ జిల్లా. పరకాల నియోజకవర్గం. గీసుగొండ మండలం కొమ్మాల గ్రామ శివారు నుండి సూర్యతండా వరకు రూ.1కోటి 50 లక్షలతో నూతనంగా వేయనున్న తారురోడ్డు పనులు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంఖుస్థాపన చేయడం జరిగింది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఏర్పడ్డ అనతికాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేసి,తండాల అభివృద్ధికి నిధులు మంజూరుచేసి గిరిజన కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత తెరాస ప్రభుత్వానిదే అన్నారు.నియోజకవర్గంలోని ప్రతి తండాలో ఈ రోజు నూతన రోడ్లు వేసుకోవడం జరిగిందన్నారు. గిరిజనులకు కనీస వసతులు కల్పించని చరిత్ర గత ప్రభుత్వాలదన్నారు.గ్రామాలుఅభివృద్ధి చెందుతేనె రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నారు.దేశంలో ఎక్కడలేని విధంగా రైతు సంక్షేమం కోసం రైతుబంధు,రైతుభీమా పథకం ప్రవేశపెట్టి, రైతు ఏ కారణం చేత మృతిచెందిన రూ.5లక్షలు ఆ రైతు కుటుంబానికి 11 రోజుల్లో ఇస్తున్న ఘనత కేసిఆర్ గారిది.పేదింటి ఆడపడుచు పెళ్లికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.100116/-అందిస్తు ఆ ఇంటి పెద్దకొడుకు కేసీఆర్ అయ్యారన్నారు.మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనతికాలంలో గోదావరి జలాలను ప్రతి ఇంటికి అందిస్తున్న అపర భగీరధుడు కేసీఆర్ గారన్నారు. KUDA చైర్మన్ మర్రి యాదవరెడ్డి గారు మాట్లాడుతూ నిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించే మంచి ఎమ్మెల్యే ఉండడం నియోజకవర్గ ప్రజల అదృష్టం.కేసీఆర్,కేటీఆర్ గార్ల ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ధర్మారెడ్డి గారు నిలబెట్టారన్నారు. *-ట్రాక్టర్ల ప్రారంభం..* రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని విశ్వనాథపురం,కొమ్మాల గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణకు కోసం నూతనంగా ఖరీదుచేసిన ట్రాక్టర్లను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు,ఎంపిపి,జెడ్పిటిసి,మండల అధికారులు,తెరాస నాయకులు,కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.