వరంగల్ జిల్లాలోని దామెర మండల కేంద్రంలో ఓడీసీఎంఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. రైతులంతా సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేరవేయాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా జాగ్రత్తపడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తే ఉపేక్షించేదిలేదన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
అనంతరం ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్డు పనుల్లో నాణ్యత కలిగి ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులను పరిశీలించాలని సూచించారు. కరెంటు స్తంభాలను వెంటనే వేసి... వైరింగ్ చేయాలన్నారు. రానున్న రోజుల్లో దామెరా మండలంను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: అమిత్ షా నివాసంలో మంత్రుల భేటీ-ఆందోళనపై చర్చ