వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులకు సూచించారు.
దేశంలో ఎక్కడలేని విధంగా రైతుల కోసం వేదికలు నిర్మిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. ఈ వేదికలతో అన్నదాతలకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించుకోవచ్చన్నారు. దసరా పండుగలోగా నియోజకవర్గంలోని 24 రైతువేదికల నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు.
ఇదీ చూడండి: కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి : కేసీఆర్