వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని మల్లారెడ్డి పల్లి కాలనీలోని ప్రభుత్వ ఎస్సీ వసతిగృహంలో ఉంటూ 7వ తరగతి చదువుతున్న రాజు అనే విద్యార్థి హాస్టల్ నుంచి తప్పిపోయాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో బస్సు డిపో దగ్గర దీనంగా కూర్చొని ఉన్నాడు.
బాలుడిని చూసిన బండి రమేష్ అనే వ్యక్తి నీవెవరు, ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నంచగా సమాధానం రాలేదు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చాడు. చివరకు బాబు ఎస్సీ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నాడని తెలుసుకున్న పోలీసులు రాజుని హాస్టల్‌కి తరలించారు. పిల్లలను సరిగ్గా చూసుకోవాలని వార్డెన్ని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!