ETV Bharat / state

బండి మాట అబద్ధాల మూట: ఎర్రబెల్లి దయాకర్​ రావు - పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు వార్తలు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మూట అని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు.

panchayathiraj minister errabelli dayakar rao fire on bjp state president bandi sanjay in warangal rural distrct
బండి మాట అబద్ధాల మూట: ఎర్రబెల్లి దయాకర్​ రావు
author img

By

Published : Sep 19, 2020, 4:34 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ అధ్యక్షతన వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు పాల్గొన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మూట అని ఎర్రబెల్లి అన్నారు.

సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆ పథకాలు అన్ని కేంద్రం ఇచ్చే నిధులతో నడుస్తున్నాయని అనడం దారుణమన్నారు. ఆసరా పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం 11 వేల కోట్లు కేటాయిస్తే.. కేంద్రం రూ. 200 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​, భాజపాకు బుద్ధి చెప్పాలన్నారు.

బండి మాట అబద్ధాల మూట: ఎర్రబెల్లి దయాకర్​ రావు

ఇదీ చదవండి: కుల ధ్రువీకరణ పత్రాల జారీలో అప్రమత్తత అవసరం: మంత్రి సత్యవతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.