వరంగల్‌లో ప్రేమోన్మాది దాడి ఘటనలో బాధితురాలిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. రవళి తన ప్రేమను అంగీకరించలేదని కళాశాలకు వెళ్తుండగా నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే బాధితురాలిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయం కావడం వల్ల సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న రవళిని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డితో పాటు సీపీ రవిందర్ పరామర్శించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కఠినంగా శిక్షిస్తామని సీపీ స్పష్టం చేశారు. యశోద ఆస్పత్రి యాజమాన్యంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. సాయంత్రం ఆస్పత్రికి వెళ్లి రవళి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకోనున్నారు.
ఇవీ చదవండి:
యువతికి నిప్పంటించాడు
బహిరంగంగా ఉరి తీయాలి
ఉన్మాది లొంగుబాటు
ఉన్మాదిని ఉరితీయండి!
ప్రేమిస్తే చంపే హక్కుందా?