వరంగల్ గొర్రెకుంట ఘటనలో మరో కొత్త కోణం బయటపడింది. తవ్వినకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తొమ్మిది మందే కాదు అంతకు ముందు ఓ యువతిని చంపేసినట్టు కిల్లర్ సంజయ్ పోలీసులకు విచారణలో వెల్లడించాడు.
మక్సూద్ బంధువైన యువతి సంజయ్‌కి సన్నిహితంగా ఉండేది. కొన్నాళ్లుగా ఆమె కనిపింకుండా పోయింది. ఈ తొమ్మిది హత్యల విచారణలో పోలీసులు మరో నిజం కక్కించారు. మార్చి8న ఓ యువతిని నిడదవోలు వద్ద హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.
కోల్‌కతా తీసుకెళ్తున్నానని చెప్పి ఆ యువతిని రైలు నుంచి తోసేసినట్లు సంజయ్‌కుమార్ ఒప్పుకున్నాడు. పోలీసులకు చెబుతారనే భయంతో మక్సూద్ కుటుంబాన్ని హతమార్చాడు. ఇలా మొత్తం 10 మందిని హత్య చేశాడు. ఇవాళ నిందితుడు సంజయ్‌ను వరంగల్ సీపీ సాయంత్రం 4 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
- సంబంధిత కథనాలు: ఆ బావిలో తొమ్మిది మృతదేహాలు..
- సంబంధిత కథనాలు: బావిలో లభ్యమైన మృతదేహాలకు శవపరీక్ష పూర్తి
- సంబంధిత కథనాలు: ఆపరేషన్ బావి
- సంబంధిత కథనాలు: నువ్వైనా చెప్పవే! ఎలా జరిగిందో... ఎవరు చేశారో..?
- సంబంధిత కథనాలు: బావి ఘటనలో దర్యాప్తు ఇలా సాగింది..