ETV Bharat / state

'గిరిజన బిడ్డలు కావడం వల్లే కేసును పట్టించుకోవట్లేదు'

author img

By

Published : Dec 27, 2019, 3:03 PM IST

నాలుగు సంవత్సరాల క్రితం వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం ఖాదర్ పేట శివారు గుట్టపై అనుమానస్పదస్థితిలో మృతిచెందిన ప్రియాంక, భూమికలకు రీపోస్టు మార్టం నిర్వహించి సీబీఐతో విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

mrps
'గిరిజన బిడ్డలు కావడం వల్లే కేసును పట్టించుకోవట్లేదు'

నాలుగు సంవత్సరాలక్రితం వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం ఖాదర్ పేట శివారు గుట్టపై అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ప్రియాంక, భూమికలకు రీపోస్టు మార్టం నిర్వహించి సీబీఐతో విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ, మానవహక్కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు, మానవ హక్కుల సంఘాల నాయకులు, ప్రియాంక, భూమికలు మృతి చెందిన గుట్టను వారి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి సందర్శించారు.

నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు గిరిజన విద్యార్థులు అనుమానాస్పదంగా మృతిచెంది నాలుగు సంవత్సరాలు గడిచిపోయినా పోలీసులు నిందితులను పట్టుకోలేదని అన్నారు. ఈ నేరానికి పాల్పడిన వారిలో అధికార పార్టీకి చెందిన ప్రముఖుల పిల్లలు ఉండడం వల్లనే ఈ కేసును నీరుగారుస్తున్నారని మందక్రిష్ణ ఆరోపించారు.

హైదరాబాద్​లో ప్రియాంక రెడ్డి చనిపోయిన పదిరోజులలోనే నిందితులను ఎన్​కౌంటర్ చేశారని.. కానీ ప్రియాంక, భూమికలు గిరిజన బిడ్డలు కావడం వల్లే కేసును పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రియాంక, భూమికలకు రీపోస్టుమార్టం నిర్వహించి సీబీఐ చేత విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.