వరంగల్ జిల్లా పరకాల మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక లాంఛనం కానుంది. ఎంపీపీ ఎస్సీ మహిళకు రిజర్వు కాగా... మండల పరిధిలోని వెల్లంపల్లిలో మాత్రమే ఎస్సీ మహిళ గెలిచింది. అక్కడి నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి స్వర్ణలతకు మాత్రమే ఎంపీపీగా అవకాశం దక్కనుంది. ఎంపీపీ ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి: మహబూబాబాద్‌లో ఎంపీపీ ఎన్నిక ప్రారంభం