వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రూ.65 లక్షల వ్యయంతో నిర్మించిన రక్తనిధి కేంద్రాన్ని ఎంపీ పసునూరి దయాకర్, స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు ప్రారంభించారు. తెరాస కార్యకర్తలు, ప్రజలకు ఉపయోగపడేలా రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేశామన్నారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు.
గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురి కాకుండా రెవిన్యూ అధికారులు సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలని, గ్రామాభివృద్ధికి గ్రామ ప్రజలు సహకరించాలని ఎంపీ పసునూరి అన్నారు. కరోనా మహమ్మారి వల్ల నిధుల కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.308 కోట్లు విడుదల చేస్తుందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని ఎంపీ అన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణకు కొత్తగా కేటాయించేది మూడు రైళ్లేనా ?