ETV Bharat / state

వాళ్లు కూడా చదువుకోవాలని... స్మార్ట్​ ఫోన్​లు ఇస్తున్నారు

కొవిడ్ కారణంగా విద్యాసంస్థలన్ని ఆన్​లైన్​ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులు కూడా ఇంట్లోనే కూర్చుని తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్​ల సహాయంతో పాఠ్యాంశాలను వింటున్నారు. అయితే తల్లిదండ్రులు లేని అనాథలు, ఆర్థికంగా నిరుపేద కుటుంబాలకు చెందిన వారి పిల్లలు స్మార్ట్‌ఫోన్​లు లేక పాఠ్యాంశాలు వినలేకపోతున్నారు. అటువంటి వారు విద్యాపరంగా వెనకపడకూడదనే ఉద్దేశంతో బాలవికాస స్వచ్ఛంద సంస్థ వారికి ఉచితంగా స్మార్ట్‌ఫోన్​లు అందిస్తుంది.

author img

By

Published : Nov 20, 2020, 9:29 AM IST

mobile-phones-distribution-to-children-for-online-classes-in-khajipet-at-warangal-urban-district
వాళ్లు కూడా చదువుకోవాలని... స్మార్ట్​ ఫోన్​లు ఇస్తున్నారు

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్​లోని బాలవికాస స్వచ్ఛంద సంస్థ... అనాథ, వింతతువుల పిల్లలు, నిరుపేద విద్యార్థులకు విద్యాపరంగా సహయసహకారాలు అందిస్తోంది. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళాభివృద్ధి పథకంలో సభ్యులుగా ఉన్న వారి కుటుంబాలకు చెందిన పిల్లలను ఎంపిక చేసి వారి ఉన్నత చదువులకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ప్రస్తుత కొవిడ్ కారణంగా నిరుపేద విద్యార్థులు ఎవరూ ఆన్​లైన్​ విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో... దాతల సహకారంతో వేయికి పైగా స్మార్ట్‌ఫోన్​లను విద్యార్థులకు అందించారు.

దాతల సహకారంతో..

వితంతువులు, పేద కుటుంబాలకు చెందిన పిల్లల నుంచి కొంత నామమాత్రపు నగదును తీసుకొని... కెనడాలోని దాతల సహకారంతో 700 స్మార్ట్‌ఫోన్​లను ఈ సంస్థ పంపిణీ చేసింది. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు అమెజాన్ సంస్థ సహకారంతో 400 ట్యాబ్ ఫోనులను పూర్తి ఉచితంగా పంపిణీ చేసింది. కాజీపేట్​లోని ప్రధాన కార్యాలయంతో పాటుగా... వర్ధన్నపేట, దంతాలపల్లి, బెజ్జెంకి, హుజూరాబాద్, హైదరాబాద్ కార్యాలయాలలో ఈ ఫోన్​ల పంపిణీని నిర్వహించారు.

శిక్షణ ఇస్తూ..

పేదరికం కారణంగా ఎవరూ చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో... దాతల సహకారంతో సహయసహకారాలు అందిస్తున్నామని సంస్థ డైరెక్టర్ శౌరిరెడ్డి తెలిపారు. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న గ్రామీణ యువతకు మార్కెట్​లో ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఆర్థిక సహాయంతో పాటుగా... వారికి నిత్యం అందుబాటులో ఉంటూ తగిన సూచనలు, సలహాలు కూడా అందిస్తున్నామని వెల్లడించారు.

తమవారేవరూ లేకున్నా సంస్థ అందిస్తున్న సహకారంతో ఉన్నత చదువులు కొనసాగిస్తున్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తు లక్ష్యాలను అందుకోవడానికి సంస్థ అందిస్తున్న సహకారం మరువలేనిదని... భవిష్యత్తులో కచ్చితంగా ఉన్నత స్థాయిలో స్థిరపడతామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంస్థ అందిస్తున్న ఆర్థిక సహకారంతో ఫిజియోథెరపి, నర్సింగ్, ఇంజనీరింగ్, డిగ్రీ కొర్సులను చదువుతున్నామని అనాథ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: దాతృత్వం చాటుకున్న దాతలు.. చిన్నారులకు చేయూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.