ETV Bharat / state

'కేంద్ర మంత్రి గజేంద్రసింగ్​కు 2 లక్షల మందితో ఉత్తరాలు'

నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్​ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్​కు 2 లక్షల మందితో ఉత్తరాలను పంపే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవాదుల మూడో ఫేస్​ పనులను నిలిపివేయాలని కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేయడాన్ని నిరసిస్తూ.. ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

peddireddy
'కేంద్ర మంత్రి గజేంద్రసింగ్​కు 2 లక్షల మందితో ఉత్తరాలు'
author img

By

Published : Dec 23, 2020, 3:47 PM IST

దేవాదుల మూడో ఫేస్​ పనులను నిలిపివేయాలని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడాన్ని నిరసిస్తూ... వరంగల్​ గ్రామీణ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్​ రెడ్డి కేంద్రమంత్రికి ఉత్తరాలను పంపే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అన్ని అనుమతులను తీసుకుని పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించి దేవాదుల మూడోఫేజ్ కింద రామప్ప-రంగాయ, రామప్ప-పాకాల ప్రాజెక్టులను నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే వెల్లడించారు. పూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణం అయిపోయిన తర్వాత... ప్రాజెక్టుల నిర్మాణం నిలిపివేయలని ఆదేశాలు జారీ చేయడం తినే అన్నంలో మట్టికొట్టడం లాంటిదని అన్నారు.

అందుకోసం నిరసనగా ఈరోజు నుంచి... డిసెంబర్ 31 వరకు 2లక్షల మందితో ఉత్తరాలు వేస్తు నిరసన ఉద్యమాన్ని చేస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే.. నీళ్లకోసమని రైతులకు రెండు పంటలు పండే విధంగా ప్రాజెక్టులను నిర్మించుకుంటే... వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇవీ చూడండి: 'పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.