ETV Bharat / state

'అధికారులు.. ఎమ్మెల్యే మాటను కూడా లెక్కచేయడంలేదు' - ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తాజా వార్తలు

అధికారులు... శాసన సభ్యుల మాట కూడా వినడం లేదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా పల్లె, పట్టణ ప్రగతి సన్నాహక సభలో పాల్గొన్న ఆయన బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో గ్రామాల్లో శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు నిర్మించిన సర్పంచిలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

mla challa dharma reddy participate in palle, pattana pragati preparatory meeting
పల్లె పట్టణ ప్రగతి సన్నాహక సభలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
author img

By

Published : Jun 29, 2021, 10:48 PM IST

బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో గ్రామాల్లో శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు నిర్మించిన సర్పంచిలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పల్లె, పట్టణ ప్రగతి సన్నాహక సభలో ఆయన పాల్గొన్నారు.

అధికారులు పనుల బిల్లులు చెల్లించే విషయంలో తాత్సారం చేయకూడదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. ఈ విషయంలో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. గ్రామ స్థాయిలో పని చేసే పంచాయతీ కార్యదర్శులు పైఅధికారుల ఒత్తిడితో భయం భయంగా బతుకుతున్నారని పేర్కొన్నారు.

కొందరు అధికారులు శాసనసభ్యుల మాటను కూడా లెక్కచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి మంచి కార్యక్రమమన్న చల్లా సర్పంచిలు, గ్రామ కార్యదర్శులు కష్టపడి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, పలుపురు జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పల్లె పట్టణ ప్రగతి సన్నాహక సభలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

ఇదీ చదవండి: GOVERNER: వారి ఆదాయం పెరిగితేనే అన్నిరంగాల్లో అభివృద్ధి: తమిళిసై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.