రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 91మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందించారు. రూ.91లక్షల 10వేల 556 విలువగల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
17మంది లబ్ధిదారులకు రూ.4లక్షల 45వేల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందించారు. అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా 250 నిరుపేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వ కానుకగా బట్టలు పంపిణీ చేశారు.
పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తెరాస ప్రభుత్వం అండగా ఉంటోందని ఎమ్మెల్యే అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని కొనియాడారు.
ఇదీ చూడండి: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్