మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో యూనియన్ బ్యాంక్ నిర్వహించిన మహిళా సంఘాలకు ఋణాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన పలువురికి ఋణాలను అందించారు.
మహిళలు సాధికారతను సాధించే దిశగా అడుగులు వేయాలని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి : అదిగో.. ఆశల వాకిలి? 2021 ఎలా ఉండబోతోంది?