ETV Bharat / state

KTR on MLA Dharmareddy: 'ఎమ్మెల్యే ధర్మారెడ్డి.. ఓ స్వాతిముత్యం'

author img

By

Published : May 7, 2022, 3:19 PM IST

KTR on MLA Dharmareddy: టెక్స్​టైల్​ పార్కు వరంగల్​కు రావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్​, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలేనని మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. స్వాతిముత్యం సినిమా స్టోరీలో కమల్​హాసన్​లాగా ఈ పార్కు కోసం ఎమ్మెల్యే ధర్మారెడ్డి పట్టుబట్టారని వెల్లడించారు.

'ఎమ్మెల్యే ధర్మారెడ్డి.. ఓ స్వాతిముత్యం'

KTR on MLA Dharmareddy: మెగా టెక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటు చేసిన కీలక కంపెనీల కోసం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు.. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో కృషి చేశారని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీలో కైటెక్స్ టెక్స్ టైల్ పార్కుకు కేటీఆర్ భూమిపూజ చేశారు.

ఈ టెక్స్​టైల్​ పార్కు వరంగల్​కు రావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్​, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డినేనని ఆయన తెలిపారు. ఇది వేరే ఎమ్మెల్యేలతో సాధ్యం కాకపోయేదని.. చల్లా ధర్మారెడ్డి కాబట్టి పట్టుబట్టి సాధించారని మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్వాతిముత్యం సినిమా స్టోరీలో కమల్​హాసన్​లాగా.. ఈ పార్కు కోసం ఎమ్మెల్యే ధర్మారెడ్డి పట్టుబట్టారని వెల్లడించారు.

"స్వాతిముత్యం సినిమాలో కమల్​హాసన్​కు ఒకాయన ఉద్యోగం ఇస్తానని చెప్తాడు. ఇక తెల్లారి ఆయన పండ్లు తోముతుంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు. బాత్​రూంలోకి వెళ్లి బయటకు రాగానే అక్కడుంటాడు. ఏమైంది సార్​ నా ఉద్యోగమని అడుగుతడు. టిఫిన్​ చేసేందుకు పోతే మళ్లీ అక్కడ కనిపిస్తడు. ధర్మారెడ్డి కూడా సేమ్​ టు సేమ్​. ఒక పనిని పట్టుకున్నారంటే దానిని సాధించేదాకా వదలరు. మంత్రులందర్నీ పరేషాన్​ చేస్తరు. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన ఏ ప‌నినైనా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా సాధించే నాయ‌కుడు మీకు ఉండ‌డం అదృష్ట‌ం. ప‌రకాల కోసం, ఇక్క‌డి ప్ర‌జ‌ల కోసం ప్రతి క్ష‌ణం ప‌రిత‌పిస్తుంటారు." -కేటీఆర్​, రాష్ట్ర మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.