మరోసారి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కారులో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం కొలన్పల్లి శివారులో ద్విచక్రవాహనం ఢీ కొని ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడు. అటు నుంచి వెళ్తున్న మంత్రి కాన్వాయ్ ఆపి... స్వయంగా నీళ్లు తాగించారు. అనంతరం ఆర్థిక సాయం అందించి తన కారులో ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: కనికరించని కన్న కొడుకులు.. రోడ్డుపైనే తల్లిదండ్రులు