చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలంటే పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
జిల్లాలో ఉన్న 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందేలా కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి మధుసూదన్‌ను మంత్రి ఆదేశించారు. అనంతరం చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. తెలంగాణను పోలియో రహిత రాష్ట్రంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పోలియో చుక్కల కార్యక్రమం