రైతులను, రైతు కూలీలను అన్నివిధాలుగా ఆదుకునేందుకే ఉపాధి హామీ పనులను వీలైనంత ఎక్కువ మందికి కల్పిస్తున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ గ్రామీణజిల్లా పర్వతగిరిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు చేస్తున్న పనులు, గిడుతున్న కూలీ, కలుగుతున్న ఉపాధి వంటి విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి, ఏఏ చోట్ల ఎలా పనులు జరుగుతున్నాయనే విషయాన్ని ఆయన ఆరా తీశారు.
కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించాల్సి వచ్చిందని, దీంతో మొత్తం పనులన్నీ స్తంభించి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోందన్నారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ కూలీలకు ఉపాధి కల్పించాలని చూస్తున్నారని మంత్రి అన్నారు. అందుకే ఉపాధి కూలీలకు కూలీని కూడా పెంచారన్నారు. అలాగే రైతాంగాన్ని ఆదుకోవాలని చూస్తున్నారని, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారని కూలీలకు మంత్రి వివరించారు.
ఇవీ చూడండి: భౌతిక దూరం పాటిస్తూ... కల్లు గీసుకోవడానికి ఎక్సైజ్ శాఖ అనుమతి