ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని బురహన్పల్లి, కిష్టాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ధాన్యం విక్రయించేటప్పుడు రైతులు భౌతిక దూరం పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.