కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో.. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు పోతాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో పర్యటించి.. పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం రాయపర్తి మండలం మొరిపిరాల క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు, దివంగత భూక్యా విజయ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.. అక్కడే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
లాక్డౌన్ నిబంధనలు సడలించినంత మాత్రాన కరోనా తగ్గినట్లు కాదని మంత్రి అన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రాదవద్దని.. భౌతికదూరం పాటించి, మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఇదీ చూడండి: తీవ్ర ఉత్కంఠ.. ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురుచూపు