వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పిచ్చికుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి చెందాయి. మండల కేంద్రానికి చెందిన రాజు, సాయి మల్లు, కొమురయ్య తదితరులకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 12 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో గొర్రెల పెంపకందార్లు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి: ఓటమిని వినమ్రంగా స్వీకరించండి: భాజపా