వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు వరదకు కొట్టుకుపోయిన ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారి రోడ్డు రెండు రోజుల్లోనే వాడుకలోకి వచ్చింది. రాత్రింబవళ్లు శ్రమించి రోడ్డును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు అధికారులు. నేటి సాయంత్రం నుంచి ఖమ్మం-వరంగల్ రహదారి వాడుకలోకి వచ్చిందని.. అందుకు అవసరమయ్యే ఏర్పాట్లు త్వరగా పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే అరూరి రమేష్ వెల్లడించారు.
అలాగే కోనారెడ్డి చెరువు కట్ట గండి వద్ద నిర్మిస్తున్న రింగ్ బండ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పర్యవేక్షించారు. కోనారెడ్డి చెరువు వరద నీటితో నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అరూరి రమేష్ హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: ఓరుగల్లులో ఆగని వర్షం.. తెగిన కోనారెడ్డి చెరువు కట్ట..