వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో పాత్రికేయులు గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించారు. స్థానిక అమరుల స్థూపం వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో పరకాల ఏసీపీ శ్రీనివాస్, పాత్రికేయుల సంఘం జిల్లా నాయకులు రవీందర్ పాల్గొన్నారు.
ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన అల్లం నారాయణ.. అన్ని జర్నలిస్టు సంఘాలకు, మొక్కలు నాటాలని సూచించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన పాత్రికేయులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు.
ఇదీ చదవండిః రామోజీరావుకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన మంత్రి ఎర్రబెల్లి