ETV Bharat / state

ఒక తండ్రి ఐడియా.. వలస పిల్లల జీవితాలనే మార్చేసిందిగా - Voluntary Organizations in Warangal

Children of the migrant workers: ఒక తండ్రికి వచ్చిన ఆలోచన పలువురు వలస కార్మికుల భవిష్యత్‌ను మార్చివేసింది. అనుకున్నదే తడవుగా ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి భోజన వసతి కల్పించడంతోపాటు చెట్టు కిందే పాఠాలు బోధిస్తూ చిన్నారుల బంగారు భవిష్యత్‌కి బాటలు వేశారు. ప్రభుత్వం సహకారం అందిస్తే మరింత మంది జీవితాల్లో వెలుగులు నింపుతామని ధీమాగా చెబుతున్నారు.

Activities of Indian Disciples Mission
Activities of Indian Disciples Mission
author img

By

Published : Oct 20, 2022, 10:27 AM IST

ఒక తండ్రి ఐడియా.. వలస పిల్లల జీవితాలనే మార్చేసిందిగా

Children of the migrant workers: పాఠశాలకు వెళ్తున్నచిన్నారులంతా వివిధ రాష్ట్రాల నుంచి పొట్టచేత పట్టుకొని కూలీ పనుల కోసం వచ్చిన వలస కార్మికుల చిన్నారులు. వీధులగుండా రహదారి వెంట చెత్త సేకరించి కడుపు నింపుకొనే వారి జీవితాలను ఓ తండ్రి ఆలోచన మార్చేసింది. పాఠశాల వైపు అడుగులు వేసేలాచేసింది. వరంగల్ జిల్లా దేశాయిపేటకు చెందిన స్వామిదాస్.. తన చిన్నారులను బడిలో వదిలివెళ్తుండగా రోడ్డుపై సంచరిస్తున్న చిన్నారులను చూసి చలించిపోయి ఏదైనా సాయం చేయాలని సంకల్పించారు.

తన ఆలోచనలను సహచర మిత్రులతో పంచుకొని ఇండియన్ డిసైపుల్స్ మిషన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా చిన్నారులకు పాలు, అల్పాహారం, భోజనం అందించేవారు. వారి అవసరాలు తీర్చడంతో ఆ చిన్నారులు స్వామిదాస్ వెంట నడక సాగించారు. చిన్నారుల ఆకలితీర్చడమే కాకుండా వారినిజీవితంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు.

చదువు వల్ల కలిగి లాభాలపై చిన్నారుల తల్లిదండ్రులను ఒప్పించారు. అవసరమైన భోజనం అందిస్తానని హామీఇవ్వడంతో వలస కార్మికులు వారి చిన్నారులను పాఠశాలకు పంపేందుకు సమ్మతి తెలిపారు. ఇదే సమయంలో పరిశుభ్రతపై చిన్నారులతోపాటు తల్లిదండ్రుల్లో చైతన్యం కలిగించారు. సమీపంలోని రావి చెట్టును పాఠశాలగా మార్చుకొని చిన్నారులకు పాఠాలు బోధిస్తున్నారు.

తొలుత ఐదుగురితో ప్రారంభమైన ఆ పాఠశాలకు ప్రస్తుతం 50 మంది వరకు చిన్నారులు వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. మిత్రుల నుంచి సేకరించిన నిధులతో బడిని నడుపుతున్నట్లు తెలిపిన నిర్వాహకులు అంగన్‌వాడీల ద్వారా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను ఈ చిన్నారులకు అందించాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.