ETV Bharat / state

ఐనవోలు జాతర మొదలైంది.. కోరమీసాల మల్లన్నను దర్శించుకుందాం రండి.. - మల్లన్న స్వామి

Inavolu Mallanna Swamy Jatara: కొవిడ్​ కారణంగా గత రెండు సంవత్సరాలుగా మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగలేదు. అలాగే భక్తులు సైతం అధిక సంఖ్యలో వెళ్లలేదు. మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

Inavolu Mallanna Swamy
మల్లన్న స్వామి
author img

By

Published : Jan 14, 2023, 10:42 AM IST

అట్టహాసంగా ప్రారంభమైన మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు

Inavolu Mallanna Swamy Jatara: కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తున్న కోరమీసాల మల్లన్న బ్రహ్మోత్సవాలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. భక్తుల జయ జయ నాదాలు.. డోలు వాయిద్యాలు.. శివసత్తుల పూనకాలతో మల్లికార్జున స్వామి వారి ఆలయం భక్తి పారవస్యంతో అలరారుతుంది. సంక్రాంతి మొదలు ఉగాది వరకు మూడు నెలల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు.. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో స్వామి వారికి మొక్కులు సమర్పించుకునేందుకు అధికారుల ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హనుమకొండ జిల్లాలోని ప్రముఖ పుణ్య ఐనవోలు మల్లన్న క్షేత్రం భక్త జన సందోహంగా మారింది. మల్లికార్జున స్వామి వారికి మొక్కులు సమర్పించేందుకు వస్తున్న లక్షలాది మంది భక్తుల భద్రత దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వాహనాల్లో తరలివచ్చే దారులన్నీ పోలీసులు ముందస్తుగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడకుండా చెక్ పోస్టులు, పార్కింగ్ స్థలాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సుమారు 300 మందికి పైగా పోలీసు సిబ్బంది జాతరలో సేవలందిస్తున్నట్లు మామూనూరు ఏసీపీ నరేశ్​ కుమార్ తెలిపారు. మహిళల భద్రత దృష్ట్యా పదుల సంఖ్యలో షీ టీమ్స్ జాతరలో నిరంతరం గస్తీ కాస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్వామివారి దర్శనం మొదలు తిరిగి ఇంటికి వాళ్ళే వరకు అవసరమయ్యే అన్ని రక్షణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

"ఐనవోలులో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న 12వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 16వరకు ఉంటాయి. ముఖ్యంగా 14,15తేదీల్లో చాలా ఎక్కువగా భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. ఇందుకు తగ్గట్లుగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తును మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. దాదాపు 300 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దొంగతనాలు జరగకుండా క్రైమ్​ పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. షీటీమ్స్​ను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిరంతరం వాటి ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ విషయంలో భక్తులందరూ సహకరించాలి." - నరేష్ కుమార్​, మామునూరు ఏసీపీ

"ఐనవోలుకి ప్రతి సంవత్సరం వస్తున్నాము. గత 30 సంవత్సరాలుగా ఈ దేవాలయానికి వస్తున్నాము. మా ఇంటి దైవం మల్లన్న స్వామి. ఇక్కడ బోనం పెట్టి స్వామి వారిని దర్శించుకుంటాము. అన్ని సౌకర్యాలను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. మల్లన్న దేవుడు అన్ని కోరికలు తీరుస్తాడు. పిల్లలకు చదువులు, పెళ్లిళ్లు విషయంలో కూడా మల్లన్న తండ్రి మాకు అన్ని వేళల కాపాడుతూ వస్తున్నాడు. గత రెండు సంవత్సరాలు కొవిడ్​ భయాల వల్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకాలేకపోయాము. ఈసారి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు." - భక్తురాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.