బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో రాత్రి నుంచి కురుస్తోన్న వర్షానికి దామెర చెరువు అలుగు పారుతోంది. ఫలితంగా పక్కనే ఉన్న శ్రీనివాస్ కాలనీ, మమతా నగర్లు జలమయమయ్యాయి. పలు ఇళ్లలోకి నీరు చేరింది.
అధికారుల నిర్లక్ష్యంతోనే 2కాలనీలు పూర్తిగా జల దిగ్భందంలో ఉన్నాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీచూడండి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం.. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు